ముప్పైల్లో షుగర్ వస్తే.. 14 ఏళ్లుముందుగానే మరణం..! అంటున్నారు ...ఏంటి ఈ స్టోరీ
డయాబెటిస్.. వ్యక్తి సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్ నివేదిక విడుదల చేసింది.
డయాబెటిస్.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజారోగ్య సమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా చక్కెర వ్యాధి కారణంగా బాధపడుతున్నారు. డయాబెటిస్ దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది.
ఎంతకాలంగా షుగర్‌తో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుంటుంది. డయాబెటిస్.. మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్ నివేదిక ఆశ్చర్యపోయే విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌కు దారితీసే టైప్-2 డయాబెటిస్ సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది.
30 ఏళ్ల వయసులో టైప్-2 డయాబెటిస్ వస్తే...సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని స్పష్టం చేసింది. 40 ఏళ్ల వయసులో చక్కెర వ్యాధి వస్తే..పదేళ్ల జీవితకాలం తగ్గుతుందని, 50 ఏళ్లప్పుడు వస్తే.. సగటున ఆరు సంవత్సరాల ఆయుర్దాయం తగ్గుతుందని వెల్లడించింది.