NN1NEWS Telugu. తేదీ 26_10_2024
విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాం తెదేపా కార్యాలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు
ముందుగా ఎమ్మెల్యే తన సభ్యత్వ నమోదును రెన్యువల్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలను తెదేపా నేతలు అత్యధికంగా చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు*
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేవిధంగా అత్యధిక సభ్యత్వాల నమోదు చేసి రికార్డు స్థాయిలో నిలవాలని పిలుపునిచ్చారు*
వందరూపాయల సభ్యత్వంతో ఐదులక్షల ప్రమాదభీమా దేశంలో ఎక్కడా లేదన్నారు.సహజ అమరణం అయితే పదివేలన్నారు.వారి కుటుంబ సభ్యుల కోసం విద్యా ,వైద్యం,ఉపాది కోసం తెదేపా సాయం అందిస్తాదన్నారు*
అనంతరం రాజాం పట్టణం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) బజార్ ను శనివారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు*
ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఎమ్మెల్యే అన్నారు.మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజవర్గం మండల నాయకుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు