NN1NEWS.Oct 23. ఏలూరు జిల్లా.. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణంలో అక్టోపస్ బలగాలతో మాక్ డీల్ నిర్వహణ కార్యక్రమం..
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అక్టోపస్ బలగాలు హడావిడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ ఆస్తులను ఎలా కాపాడాలనే అంశం పై నిర్వహించిన మాక్ డ్రిల్ చేశారు. ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఉగ్రవాదులు ముప్పేట దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి, అర్ధరాత్రి లేదా భక్తులు రద్దీగా ఉండే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు అక్టోపస్ బలగాలు ఆలయం ప్రాంగణంలో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, ఆక్టోపస్ బలగాలతో పాటుగా, స్థానిక పోలీసులు సైతం ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు.