-చర్చ్ పేట 7వ సచివాలయం వద్ద ఉన్న పబ్లిక్ మరుగు దొడ్లు తొలగించాలని డిమాండ్.
తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు, చర్చ్ పేట 7వ సచివాలయం వద్ద ఉన్న పబ్లిక్ మరుగు దొడ్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ చర్చ్ పేట యూత్. పెద్దలు ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ గారికి 7వ సచివాలయం అడ్మిన్ గారికి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జువ్వల రాంబాబు మాట్లాడుతూ చర్చ్ పేట లో దళితులు మైనార్టీ. బీసీ వర్గాలు 3వేలమంది నివసిస్తున్నారని పట్టణంలో ఎంతో గుర్తింపు పొందిన చర్చ్ పేటలో ముఖద్వారం వద్ద పబ్లిక్ మరుగు దొడ్లు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని,
వర్షాలు కురిసే కాలంలో ఆ ప్రాంతం అంతా మునిగిపోయి మరుగు దొడ్లులోని మల మూత్రాలు బయటకు వచ్చి ఇళ్లలోకి ప్రవేశించటం ప్రజలు భరించ లేకుండా ఉన్నారని తెలిపారు ప్రస్తుతం అది ఉపయోగంలో లేకపోయినా రాత్రి సమయాల్లో బయట నుండి వచ్చే వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని రాంబాబు మాట్లాడుతూ అన్నారు. వెంటనే మరుగు దొడ్లు తొలగించి ఆ స్థలంలో విద్యార్దులకు ఉపయోగపడే గ్రంథాలయాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరు కుంటున్నారని రాంబాబు అన్నారు ఈ కార్యక్రమంలో.U మోషే. ఎల్లే పండు. మర్రిపూడి రాజేష్ దాకే సతీష్ నల్లా రాంబాబు పిట్టా నాగరాజు K అశోక్ నల్లా లెనిన్ తలారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.