పోక్సోయాక్ట్ గురించి ఆపద సమయాలలో కొన్ని చిట్కాలు
NN1NEWS. ఏప్రియల్ 23.
పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జ్ ఏఎస్ఐ పప్పుల సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తమ్మి నాయుడు విద్యాసంస్థ సురేష్ స్కూళ్లలో శక్తి యాప్ తో పాటు బాలికలు బాలురు మహిళలు పైన లైంగిక వేధింపులు గురించి మరియు గుడ్డ్ టచ్ బ్యాడ్ టచ్ , పోక్సోయాక్ట్ గురించి ఆపద సమయాలలో కొన్ని చిట్కాలు తెలియ చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం కరాటే విద్యలు తెలిసి ఉండాలని అవగాహన కల్పించారు మరియు మరియు గంజాయి మాదకద్రవ్యాలు నిర్మూలన పైన అవగాహన సదస్సు కల్పించారు శక్తి టీం 3 ఇంచార్జ్ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకువిద్యార్థులు మహిళలు శక్తి యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ల ఫోన్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అవుతుందని అలాగే పుట్టిన పసిబిడ్డ నుండి వృద్ధురాలి వరకు ప్రతి మహిళ మహిళలకు విద్యార్థులకు ఏదైనా సంఘటనలు జరిగితే పోలీసులు 15 నిమిషాల లోపు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితకు సహాయం అందిస్తారని వెల్లడించారు మహిళలు చిన్నారి భద్రత కోసం 13 సేవలతో కూడిన శక్తి యాప్ ఉందని తెలిపారు ప్రతి శక్తి టీమ్ ఉదయం నుండి సాయంత్రం వరకు కళాశాలలు ప్రాంగణాలు బహిరంగ ప్రదేశాలు ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాండ్ దగ్గర వుంటాయని అన్నారు.