అంబేద్కర్ అందరివాడు..ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
NN1NEWS. ఏప్రియల్ 14.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం.అంబేద్కర్ అందరివాడు..ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరి వాడని సమాజ స్థాపనకు ఆయన కృషి చేశారని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పేర్కొన్నారు.
అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా చింతలపూడి లో నియోజకవర్గం లో బోయగూడెం, పాత చింతలపూడి మరియు పాత బస్టాండ్ సెంటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన ఆలోచనలు ఆశయాలు సజీవంగా ఉంటాయని రోషన్ కుమార్ కొనియాడారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అంబేద్కర్ యావత్తు ప్రపంచం మేధావిగా ఆదరిస్తోంది. ఈ కార్యక్రమాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు.