ప్రయాణికులకు అలర్ట్.. దసరా పండుగ వేళ కీలక ప్రకటన చేసిన ఏపీఎస్ఆర్టీసీ..
Vijayawada, October 05: దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకలోని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు సిద్ధంచేస్తున్నారు.
ఈ నెల 13 నుండి 26 వరకు.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నడపనుండి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.