ఏలూరు జిల్లా చింతలపూడి.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తమ పూర్వీకులు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతోందని కమిటీ నాయకులు రాము తెలిపారు.
చింతలపూడి వేలంపేట లో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతిరోజు అమ్మ వారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని రాము తెలిపారు ముగింపు రోజు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.