శృంగవరపుకోటలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.కోట నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి లలిత కుమారి.
శృంగవరపుకోట మండలం, శృంగవరపుకోట గ్రామంలో చింతా దెప్పి, రెల్లి వీధిలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో యూనిట్ ఇంఛార్జ్ సరిపల్లి రామకృష్ణ సారథ్యంలో శుక్రవారం బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. కావున పట్టణంలో ఉన్న ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే, వాటిని మరల చేర్పించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి భీశెట్టి అరుణ, శృంగవరపుకోట మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జీ.ఎస్.నాయుడు, క్లస్టర్ ఇంఛార్జ్ & విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు,ఐటిడిపి రాష్ట్ర కార్యదర్శి చక్కా కిరణ్కుమార్, బుత్తల సన్యాసిరావు,బోనంగి జ్యోతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.