8,9 విద్యార్థులకు యువత శిక్షణా కేంద్రంలో అవగాహన కార్యక్రమం.
ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవదికారసంస్థ అధ్యక్షులు సిహెచ్ .వివేక్ ఆనంద్ శ్రీనివాస్ మరియు సెక్రటరీ సన్యాసినాయుడు సమక్షంలో పాలకొండ నియోజకవర్గం సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల 8,9 చదువుతున్న విద్యార్థులకు యువత శిక్షణా కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల,తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగిన చట్టాల పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది.అదే విధంగా నేడు ప్రపంచ జల దినోత్సవం సదర్భంగా నీటిని వినియోగించే పద్ధతులు, ఆదా చేసే విధానాల గురించి పిల్లలకు అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆర్. కుమారస్వామి, ఎం. సామ్యూల్ పాల్గొన్నారు..