చిన్నారుల విద్య ఆరోగ్యం పై శ్రద్ధచూపాలని అవగాహన
పాలకొండ నగర పంచాయతీ పరిధి ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారి సిమ్మలమ్మ ఆధ్వర్యంలో పోషణ భీ పడాయి భీ మీద 3 రోజుల శిక్షణ నిర్వహించారు.. ఇందులో భాగంగా నేడు చిన్నారుల విద్య ఆరోగ్యం పై శ్రద్ధచూపాలని అవగాహన కల్పించారు.పి ఓ మాట్లాడుతూ నాణ్యమైన బాలల సంరక్షణ అలాగే విద్యపై జాతీయ విద్యా విధానం ద్వారా 2030 కి అభివృద్ధి సాధించడం పోషణ భీ పడాయి భీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం చివరి రోజున అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ పత్రాలు అందజేశారు.. కార్యక్రమంలో సిడిపిఓ సిమ్మలమ్మ, సూపర్వైజర్ దశ రత్నం, రాజేశ్వరి, జ్ఞానమ్మ బిపిసి త్రివేణి, అరుణ జ్యోతి పాల్గొన్నారు..