చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాదయాత్ర
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం
- చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాదయాత్ర
- ఇచ్చాపురంలో పాదయాత్ర ప్రారంభించిన నెల్లూరు వాసి
- ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు యాత్ర
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా కు చెందిన చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి పురుషోత్తపురం జంక్షన్ నుండి తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు.
1200 కిలోమీటర్ల పాదయాత్ర
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని వచ్చే ఎన్నికల్లో టిడిపి- జనసేన ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతోందని అన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని అన్నారు.