NN1NEWS
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం.తెలుగుదేశం పార్టీలో బీసీలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని నియోజకవర్గం బీసీ నాయకులు డిమాండ్ చేశారు.
నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకి కల్పించాలని లింగపాలెం మండలం బీసీ సెల్ అధ్యక్షులు పిల్లల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసేరు. చింతలపూడి మండలంలో వి కే యo ఫంక్షన్ హాల్ వద్ద బీసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే బీసీ లు అని బీసిలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కి అంకిత భావంతో పనిచేస్తున్నామని తెలిపారు. అదే విధంగా చింతలపూడి నియోజకవర్గం లో లక్ష మంది బీసీ ఓటింగ్ ఉందని, ఎస్సీ లు లక్ష ఓటింగ్ ఉందని,బీసీ లు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాలుగు మండలం అధ్యక్షులు లలో 3 టీడీపీ మండలం అధ్యక్షులు పదవులు బీసీ లకు ఇవ్వాలని, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఎఎంసీ చైర్మన్ పదవి బీసీ లకి కేటాయించలని కోరారు.ఈ కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో దాసరి శ్యామ్ సుందర్ శేషు
సాయిల సత్యనారాయణ
చిన్ను శ్రీనివాస యాదవ్
పిల్లల శ్రీనివాస్ యాదవ్
మరిదు వెంకట్రావు
కొప్పెర్ల నాగరాజు
కొండిబోయిన యువరాజు
తాళం సోంబాబు
పామర్తి సత్యనారాయణ
కొండు బోయిన సురేష్
చింతలపూడి నియోజకవర్గ నాలుగు మండలాల బీసీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.