నిరుపేద కుటుంబానికి జనసేనపార్టీ ఆర్థిక సహాయం
NN1NEWS. ఏప్రియల్ 17.
ఏలూరు జిల్లా,చింతలపూడి నియోజకవర్గం.ఈరోజు ప్రగడవరం పంచాయతీ నరసింగాపురం గ్రామంలో మధ్యాహ్నపు సత్యనారాయణ అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబం ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఒక నిరుపేద కుటుంబానికి జనసేనపార్టీ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మధ్యాహ్నపు సూరిబాబు ఈరోజు చింతలపూడి మండల జనసేనపార్టీ అధ్యక్షులు చీదరాల మధుబాబు చేతుల మీదుగా 22000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సహాయం అందించడంలో ముందుండి నడిపించిన నల్లగోపు సూర్యచంద్రరావు మాదాసు రాంబాబు , ప్రగడవరం గ్రామపార్టీ అధ్యక్షులు కోసాన చంద్రబాబు మధ్యాహ్నపు వెంకన్న మరియు నరసింగపురం గ్రామ జనసేనపార్టీ నాయకులందరూ కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు ఆగ్స్ కుమార్ మాదాసు అజయ్ తోట ప్రసాదు బంటు లక్ష్మణరావు , కాలాబత్తుల రాజేష్ గ్రామ్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.