* మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని*
*గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకోవాలి !!*
*--- మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని*
గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ.. మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని చెబుతూ,
నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని ) శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం సాయంత్రం అయిన న్యూ ఇయర్ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నూతన ఏడాది పురస్కరించుకొని నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారని ఎమ్మెల్యే పేర్ని నాని పునరుద్ఘాటించారు.
విప్లవాత్మకమైన అభివృద్ధి కొత్త పుంతలు
గతంలో అభివృద్ధికి నోచుకోక ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు మచిలీపట్నం అసెంబ్లీ నియోజవర్గం ఉండేది. 2019 లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కృష్ణాజిల్లా వాసుల చిరకాలవంచ కార్యరూపం దాల్చి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు చక చక కొనసాగుతున్నాయన్నారు, ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జరిగి మొదటి బ్యాచ్ కు చెందిన 150 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు మచిలీపట్నంలో చదువుకుంటున్నారని, సముద్రం మొగ పూడుకు పోయి చేపల వేట వెళ్లే ఫిషింగ్ బోట్లు సముద్రంలోనికి వెళ్లి రావాలంటే మత్స్యకారులు దినజన గండం నూరేళ్లు ఆయుష్షుగా రోజులు గడిపే వారిని ప్రస్తుతం ఆధునాతనమైన సురక్షితమైన ఫిషింగ్ హార్బర్ వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిందన్నారు, మచిలీపట్నం నియోజవర్గంలో 26 వేల మందికి ఇళ్ల స్థలాలు..ఇలా ఎన్నో మచిలీపట్నంకు దక్కాయిన్నారు. గతమెంతో ఘన కీర్తి గల మచిలీపట్నంలో 76 ఏళ్లుగా లేని విప్లవాత్మకమైన అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందన్నారు.
సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్
ప్రభుత్వం నవరత్నాల కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ రాజకీయాలకతీతంగా అందజేయడం గమనార్హంమన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం దేశంలో అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే పేర్ని నాని స్పష్టం చేశారు. అనతికాలంలో మన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు.
2024 నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేస్తూ, నూతన సంవత్సరం నిలవాలని ఎమ్మెల్యే పేర్ని నాని అభిలక్షించారు. 2024 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పేర్ని నాని సూచించారు.
ప్రజలు కోవిడ్, జె వన్ వేరియంట్ కు తగిన జాగ్రత్తలు
ప్రజలు కోవిడ్, జె వన్ వేరియంట్ కు తగిన జాగ్రత్తలు పాటించి నూతన, ఆరోగ్యకర న్యూ ఇయర్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని, 2024 సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు జరగాలని, సుఖ సంతోషాలు వెల్లి విరియాలని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకొంటున్నట్లు తెలిపారు.