ఏపీ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ప్రకటన..!
AP: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రజారోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీల కార్మికులకు రూ. 6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాల్లో పని చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు, మలేరియా వర్కర్లకు ఈ అలవెన్స్ వర్తిస్తుంది.