ఎల్.కోటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కోళ్ల దంపతులు.
*పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అండగా ఉంటామని హామీనిచ్చిన కోళ్ల దంపతులు*
లక్కవరపుకోట మండలం, లక్కవరపుకోట గ్రామంలో ఉన్న *శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* గారు నివాసం వద్ద *రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్* గారు సారథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాల్లో గల వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ గల తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ వర్గాల సంఘ నాయకులు, మోటార్ యూనియన్ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులతో కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
*నరకానికి పరాకాష్ట మనం అందరం కల్ళరా చూసాం*
అనంతరం కోళ్ల దంపతులను పుష్పగుచ్చాలతో, గజమాలతో దుస్సాలువ కప్పి కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగున్నర నరకానికి పరాకాష్ట నా 2023లో ప్రత్యక్షంగా అనుభవించడం భరించాం ఒక్క అవకాశం అని ప్రాధేయపడితే నమ్మి అర్హత లేని వారిని అందలమెక్కిస్తే జరిగిన నష్టాన్ని మనం అందరం కల్ళరా చూసాం అని అన్నారు. అందుకే ఒక కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అని అన్నారు. నూతన సంవత్సరములో హింసకు, అశాంతికి, అక్రమాలకు తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతిష్టమైన పునాదులు వెయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
*మానవుడిగా తీర్చిదిదే బృహత్ కార్యానికి నాంది*
రాష్ట్రంలో ప్రతి తెలుగు వాడిని నైపుణ్యతగల మానవుడిగా తీర్చిదిదే బృహత్ కార్యానికి నాంది పలికే అవకాశం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి కూటమికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అన్నివిధాలా అండగా ఉంటామని కోళ్ల దంపతులు హామీ ఇచ్చారు. అదేవిధంగా మాకు అండగా ఉంటూ, పార్టీ కోసం హర్నిశలు కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాల్లో గల వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అశేష ప్రజానీకానికి అందరికీ కోళ్ల దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి మండలాల్లో గల వివిధ హోదాలలో ఉన్న అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లు, వివిధ వర్గాల సంఘ నాయకులు, మోటార్ యూనియన్ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మరియు తదితరులు పాల్గొన్నారు.