లక్కవరపుకోట మండలం, గంగుబుడి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంబించిన శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఈ సందర్బంగా ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో జరుగుచున్న మొట్టమొదటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అని పేర్కొన్నారు. క్రీడల ద్వార గ్రామ స్థాయీ నుండి ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించడమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను కనుగోని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటిపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యం గా ప్రవేసిపెట్టిన ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్న ప్రతీఒక్కరు ఆడి ప్రతిభాను కనబరచుకోవాలి కోరారు.
ఈ కార్యక్రమములో స్థానిక సర్పంచ్ గొలగాని హరిప్రసాద్, తోనంగి ఎరి నాయుడు, వాలంటీర్స్, ముక్యనాయకులు, కార్యకర్తలు, తధితరులు పాల్గొన్నారు.