సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో...!
ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉచ్చలవరం నందు వికలాంగుడు దస్తగిరి కి పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ చాలా గొప్ప మనసు చాటుకుంటుంది.
దస్తగిరి అతని ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉంది అని సహాయం కావాలి అని అని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో.. ఆ వీడియో చూసిన వెంటనే ఆ వీడియో అతని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉండటంతో... మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని మన ట్రస్ట్ మెంబర్ పసుపులేటి వినోద్ స్పందించారు.
ఆ వీడియోలో ఉన్న మొబైల్ నెంబర్ కి కాల్ చేసి మా ట్రస్టు మీకు అండగా ఉంటుంది అని దస్తగిరి కి ఒక భరోసా ఇవ్వడం జరిగినది. దస్తగిరి పరిస్థితి అతని రెండు కాళ్లు సచ్చుపడి ఉండటంతో చేయి కూడా దాదాపు ఆరు సంవత్సరాల కిందట రైలు కింద పడి చెయ్యి కట్టు కావడంతో అతని జీవనం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఉండటంతో .... ఈ విషయం ఆ ట్రస్టు చైర్మన్ పసుపులేటి పవన్ కుమార్ కి తెలియజేయడమైనది. ఆ చైర్మన్ సహాయం కోరిన ప్రతి ఒక్క కుటుంబంకి అండగా నిలబడదాం అని దస్తగిరి కుటుంబం కి ఒక నెల నిత్యవసర సరుకులు ఇవ్వాలని వినోద్ కి తెలియజేశారు.
చైర్మన్ మాట్లాడుతూ ఆ కుటుంబంకి అన్ని విధాలుగా అండగా ఉందామని తెలియజేశారు. దస్తగిరికి ఈరోజు మన ట్రస్ట్ నెంబర్ పసుపులేటి వినోద్ చేతుల మీదుగా వారికి నిత్యవసర సరుకులు ఇచ్చి మీ కుటుంబానికి మేము అండగా నిలబడతామని తెలియజేశారు.
దస్తగిరి మాట్లాడుతూ నా కుటుంబంకి సహాయం చేసిన ట్రస్టు చైర్మన్ పసుపులేటి పవన్ కుమార్ కి అలాగే ట్రస్ట్ మెంబర్ పసుపులేటి వినోద్ కి మీ సహాయం అనేది నేను జన్మజన్మలో మరువను అని దస్తగిరి మాటలలో చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్ మధుబాబు, రాజు పుల్లారెడ్డి పాల్గొన్నారు.