గొంప అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం లో టిడిపి పార్టీ ఆదేశాల మేరకు బాబు సూర్యుడి భవిష్యత్తుగ్యారంటీ లో భాగంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట పార్టీ కార్యాలయం నుండి ఎస్ కోట మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆరు అంశాలతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఆరు అంశాలతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు తెలియజేసేందుకు నియోజకవర్గంలో ఐదు మండలాలు బైక్ యాత్ర ఈరోజు నుండి ఎస్ కోట నుండి మొదలుపెట్టా... మిగతా నాలుగు మండలాలు రోజుకో మండలం లో బైక్ యాత్ర నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట మండల నాయకులు టిడిపి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.