లక్కవరపుకోట.
కోళ్ల దంపతులను పరామర్శించిన టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు Church నాగార్జున*
స్వర్గీయ కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు కోళ్ల అప్పలనాయుడు భార్య కోళ్ల పైడితల్లమ్మ శుక్రవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎల్.కోటలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ చీపురుపల్లి టీడీపీ ఇంచార్జ్ & విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పూసపాటిరేగ మండల నాయకులు & పూసపాటిరేగ మాజీ జెడ్పిటీసీ, శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి ఒబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు), గోల్డ్ స్టార్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ బి.ఎం బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎస్.కోట మండలం వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, ఎల్.కోట వైసీపీ సీనియర్ నాయకులు కూరాకుల సూర్యారావు (సూరితాత), రాష్ట్ర వైసీపీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, కొత్తవలస మండలం మాజీ ఎంపీటీసీ మేలాస్త్రి అప్పారావు, ఉత్తరపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ మరియు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కోళ్ల దంపతులను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ గల వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులు, కోళ్ల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, మిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.*
#Team_Kolla