*4వ విడత ఆసరా సంబరాలు*
విజయనగరం జిల్లా, శృంగవరపుకోట స్థానిక ఆకుల డిపోలో ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్ ఆసరా 4వ విడత చెక్కును అందజేస్తున్న కార్యక్రమనీకి ముఖ్య అతిగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ యొక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళలను కలిసి వారి కష్టసుఖాలును తెలుసుకొని వారికీ అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన నూటికి 99%శాతం పథకాలును అమలుపరిచి నేరుగా వారియొక్క ఖాతాల్లో జమ అయ్యేట్టు చేసిన ఘనత ఒక్క మన ముఖ్య మంత్రి జగనమోహన్ రెడ్డి కే దక్కుతుంది అని అన్నారు.
అంతే కాకున్న రానున్న రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని మళ్ల మిమ్మల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మాకు ఓటస్తే మీకు అంత మంచే జరుగుతాది అని తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీ నాయకులు వస్తారని వాళ్ళు చెప్పిన మాటలు నోమొద్దు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కటే అంటున్నారు. నావల్ల మీకు మంచి జరుగుతుంది అంటేనే ఓటు వెయ్యండి అని అంత కచ్చితంగా చెపుతున్నారు. అంటే జగన్నన్న చేసిన మేలు ఏవోక్కా పేదవాడు మరిచిపోరు కావునే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు, అదే పసుపు జెండా వాళ్ళు అలా చెప్పగలర అని ఏద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఎవరు ప్రజలను బాగా చూసుకుంటున్నారో తెలుసుకొని ఓటు వెయ్యాలని, జగనన్న మరో సారి గెలిపించు కుంటేనే పేదవాడి జీవితాల్లో వెలుగు ఉంటుంది అని చెప్పడానికి నేను ఇంత మంచి ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా చెయ్యడం నా అదృష్టం అని, అందుకనే జగన్నన్న పది కలల పాటు ముఖ్యమంత్రి నీ చేసుకుంటే మన జీవితాలు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో డిసిసిబి చైర్మన్ వెచలపు చిన్నారామునాయుడు, ఎస్ కోట వైఎస్ఆర్ మండల పార్టీ ప్రెసిడెంట్ మోపాడ కుమార్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాలొగొన్నారు.