NN1NEWS.Febreuary 15. అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ.
మదనపల్లె ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి చేరుకుని యాసిడ్ దాడిలో గాయపడిన గౌతమి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.ఆయన వెంట ఎమ్మెల్యే షాజహాన్ భాష,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు,తంబళ్లపల్లి తెదేపా ఇంచార్జ్ జయచంద్రరెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా రవాణా క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,బాలిక ఆరోగ్య రీత్యా తనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించామని,తన ఆరోగ్యం కుదుట పడేవరకూ కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేశారు.
నిందితుడు ఎంతటి వాడైనా ఉపేక్షించేది లేదని,కచ్చితంగా కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.బాలిక తండ్రి జనార్దన్ తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబుతో ఫోన్ లోమాట్లాడించారు.బాదితురాలి కుటుంబానికి లోకేష్ అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. యాసిడ్ దాడికి చేసిన వ్యక్తికీ కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ, మదనపల్లి ఎస్పీ, పోలీస్ అధికారులు తెలిపారు.