NN1NEWS. ఏప్రియల్ 07.
ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గం,చింతలపూడి మండలంలోని *పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ (ప్రమాద భీమా) కార్డులను చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు*
2 సంవత్సరాలకు కలిపి 100 రూ.చెల్లిస్తే 5 లక్షల ప్రమాదబీమాను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్తింప చేయడంతో,టీడీపీ మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందని *శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చొరవతో చింతలపూడి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపించారని,భీమ్ విషయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని బోడా నాగభూషణం* అన్నారు.
*ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ* 100రూ.చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని రూ.5 లక్షలకు పెంచారనీ,అలాగే *టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు రూ.10 వేలు అందించనున్నామని,* దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.అని అన్నారు.