విజయనగరం జిల్లా, శృంగవరపుకోట.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసన గా ఈ రోజు . శృంగవరపుకోట నియోజకవర్గలో ఆకుల డిపో వద్ద శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తలు, సీనియర్ నాయుకులు, మహిళామణులుతో కలిసి రిలే నిరాహారదీక్షలో పాల్గొనడం జరిగింది.
అనంతరం గొంప క్రిష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై ఏమాత్రం సంబంధంలేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం పద్దతి కాదన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రపంచ వ్యా ప్తంగా తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని, త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని క్రిష్ణ తెలిపారు.