అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు డివిజన్ పరిధిలోని రామన్న పాలెం గ్రామములో అయిదు రోజుల కోయ బాల సాహిత్య సెమినార్.
సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్2 వరకు జరిగింది. ఇందులో భాగంగా కొయాత్తోర్ బాట ఆధ్వర్యంలో కొత్త బాల సాహిత్య స్రృ జన జరుగుతూ ఉంది. గత ఫిబ్రవరి లో జరిగిన కార్యశాల కు కొనసాగింపుగా ఈ కార్యశాల జరిగింది . ఇంతకు ముందు రచించిన బాల గేయాలను ఈ 7 నెలల కాలంలో క్షేత్ర పరీక్ష చేయడం జరిగింది. వీటిని విద్యార్థులు ఎలా అర్థం చేసుకుంటున్నరో పరిశీలించ డాని కి కోయతోర్ బాట బాషా బ్రృందం అనేక నెలలుగా కృషి చేస్తున్నది.
ఈ కోయ భాషా ప్రాజెక్టు కు సారథ్యం వహిస్తున్న జి.యాదయ్య ఈ కార్య శాలకు గైడ్ గా వ్యవహరించారు .వివిధ రకాల పద్దతులలో ఆదివాసి విద్యార్థులకు దగ్గర చేసే పనిని కోయ భాషా వలంటీర్లు విజయవంతంగా చేస్తున్నన్నారు.
విస్తృత మైన పద్ధతులు ద్వారా భాషను మరింత అభివృద్ధి చేయడం కోసం కోయ పద్యాలకు, సామెతలు,కథలు తయారు చేస్తున్నామని,తయారు చేసిన పద్యాలను,కథలు, సామెతలు , ఎడిటింగ్ కొరకు తెల్లవారి గూడెం, గుల్లేటివాడ , సీతన పల్లి, రామన్నపాలెం, మల్లేతోట పాఠశాలలోని విద్యార్థులతో పద్యాలను పాడించడం, ఆడించడం కథలు చెప్పిచడం జరిగింది. దీని ద్వారా పిల్లలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాల్గోన్నారు.
అలాగే ప్రతి గ్రామంలోని గ్రామపెద్దలతో, ఉపాధ్యాయులు తో భాషను రాబోయే కాలంలో భాష పరిరక్షణకు సంబంధించిన అన్ని అంశాలు పై వారితో చర్చించి పుస్తకాలు రూపంలో తయారు చేసి రెండు నెలల లోపు ముద్రించి ప్రజలకు, విద్యార్ధులకు చేరువ చేస్తామని రాబోయే రోజులలో మరుగున పడుతున్న కోయ భాషాను మర్రిన్ని ప్రాంతాలకు విస్తరించే అందుకు కోయత్తొర్ బాట కృషిచేస్తామన్నారు.
ఈకార్యక్రమంలో కోయత్తోర్ బాట సహ వ్యవస్థాపకులూ - ప్రాజెక్టు సమన్వయకర్త జి . యాదయ్య కోయ భాష వాలంటీర్స్ తెల్లం కృష్ణ, డుమ్మిరి సురేష్ మోసం సత్యనారాణ,, కోయత్తోర్ బాట సహ వ్యవస్థాపకులు, రచయిత్రి దుమ్మిరి భీమ్మమ, సోడే మురళీ, ఒగ్గు ముత్తయ్య, తెల్లం రమేష్ , బి . చందు, బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.