నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో నియోజవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం 22వ రోజుకు చేరుకుంది.
బుధవారం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పోలవరం తెలుగు యువత అధ్యక్షులు పెద్దేహపు సత్యనారాయణ ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు కొప్పర్ల నాగరాజు . చింతలపూడి సాధికార కమిటీ సభ్యులు కే సత్యనారాయణ , పోలవరం సాధికార కమిటీ సభ్యులు నల్లజర్ల రామకోటి , పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ , మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య , నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు , జల్లేపల్లి పెద్దబ్బులు ,నల్ల రాంబాబు, జల్లేపల్లి జితేంద్ర , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావంగా పాల్గొన్నారు.