శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం బుధవారం ముగిసింది. చివరి రోజు రిలే నిరాహార దీక్షలో టిడిపి బెంతు ఒడియ కులస్తుల నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ శిబిరానికి వచ్చి వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు... సీఎం వైఎస్ జగన్ బెదిరించి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. అక్రమంగా కేసులు బనాయించి చంద్రబాబును జైలుకు పంపి లబ్ధి పొందుదాము అనుకున్న సీఎం జగన్ అనుకుంటే.. మరొకటి జరిగిందన్నారు.
వైసిపి ఊహించిన దాని కంటే 200% సింపతి ప్రజలలో చంద్రబాబుపై ఏర్పడిందని అన్నారు. 2024 లో టిడిపి ప్రభుత్వం రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వారి ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి ఎప్పుడు వస్తారని మహిళలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని , ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు చంద్రబాబు నాయుడు కోసం పరితపిస్తున్నారని అన్నారు.