ఏలూరు జిల్లా పోలవరం..
పోలవరం నియోజకవర్గం కోయ్యల గూడెం మండలం రాజవరం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని 91వ రోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని జనసేన పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టోను జనసేన పార్టీ చేసేటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 2024లో తప్పకుండా గద్దిదించాలని లేకపోతే మన రాష్ట్రం అదా పాతాళానికి పడిపోతుందని ప్రజలందరూ కూడా వైసిపి పాలనకి చరమగీతం పాడాలని కోరుకుంటున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు సమస్యల గురించి మాట్లాడితే అరెస్టులు కేవలం కక్షపూరిత రాజకీయాల తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆలోచించట్లేదని అన్నారు. 2024లో ఉమ్మడి పార్టీల కార్యచరణతో వైసిపి పార్టీని ఓడించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.