ఏలూరు జిల్లా.
నూజివీడు ఏరియా ఆసుపత్రిలో కానిస్టేబుల్ గంధం నరేంద్ర మృతదేహాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం సందర్శించారు. నరేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 30 లక్షలు డ్యూటీలో కానిస్టేబుల్ కుటుంబానికి అందించనున్నట్లు చెప్పారు. శాఖా పరంగా అందవలసిన అన్ని ప్రయోజనాలు అందిస్తామన్నారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మృతి కారణంగా వారి కుటుంబం మొత్తం బాధ్యతను ప్రభుత్వమే చేపడుతుందని హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. నరేంద్ర కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ నరేంద్ర కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన కొనసాగిస్తూ, ఎస్పీ వాహనాన్ని నిలిపివేసే ప్రయత్నం చేయగా, ఆందోళనకారులను పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు.