అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గంలోని టీడీపీ మహిళలు సోమవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సైకో రాజ్యాంగం పోవాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు కావాలని, సైకిల్ అధికారంలోకి రావాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.