ఏలూరు జిల్లా, చింతలపూడి మండలంలో.
వివిధ పంచాయతీలలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చింతలపూడి ఎండిఓ మురళీకృష్ణ తెలిపారు.
సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో.. మండలంలో గ్రామ పంచాయతీల నుండి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు.. వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి విక్టర్ బాబు, అశోక్. హరి తదితరులు పాల్గొన్నారు.