శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం.
వైసీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మరో మారు తనలో ఉన్న మానవతను చాటుకున్నారు. సిసలైన నాయకునిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. గృహ సారథిగా ఉన్న ఒక యువకుడు మరణిస్తే అతని పాడెను మోసి తన నాయకత్వ బాధ్యతలను చాటుకున్నారు.
ఇచ్చాపురం మండలంలోని డొంకూరు గ్రామానికి చెందిన రమేష్ రౌలో అనే యువకుడు రహదారి ప్రమాదంలో మరణించాడు. సమాచారం అందుకున్న వైసిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ డొంకూరు గ్రామానికి వెళ్లారు. రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రమేష్ పాడెను మోసి అంత్యక్రియలలో పాల్గొన్నారు.