శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల.
మహాత్మాగాంధీ గారి జయంతి సందర్బంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో చేస్తున్న దీక్షకు మద్దతుగా శ్రీమతి నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా.
ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ * కిమిడి కళావెంకట రావు ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఉదయం 10.00 గంటల నుండి ప్రారంభించిన సత్యమేవ జయతే దీక్షను సాయంత్రం 05.00 గంటలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీకాకుళం జిల్లా ప్రధమ పార్టీ అధ్యక్షులు జోగిరాజు మౌళీ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.
ఈ దీక్షా కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు తమ పార్టీ శ్రేణులకు పేరు పేరు న శ్రీ కళావెంకట రావు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.