అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట.
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా
కలవపువ్వు సెంటర్లో మండపేట నియోజకవర్గ టిడిపి పార్టీ చేస్తున్న సామూహిక నిరాహార దీక్షకు మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేసారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, భవిష్యత్తులో జనసేన - టిడిపి కూటమితో ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా ఎదుర్కొనవలసి అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. అనంతరం దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.