తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, భారీ కేకును కట్ చేశారు. కుమారదేవం గ్రామ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఇలాంటి పుట్టినరోజులు. మరెన్నో చేసుకోవాలని, అలాగే 2024.లో మనమంతా తానేటి వనితమ్మను మంత్రిగా,జగన్ ను ముఖ్యమంత్రి గా చేయాలని, కార్యకర్తలు,నాయకులు ఇప్పటినుండి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వై.సి.పి కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,గృహ సారదులు,సచివాలయ కన్వీనర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.