శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల ఆవరణంలో జాబ్ మేళ
NN1NEWS: 25-03-2025 మంగళవారం. పాలకొండ మండలం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పాలకొండ నియోజకవర్గం సంబంధించి స్థానిక శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల ఆవరణంలో జాబ్ మేళ నిర్వహించటం జరిగింది. ఈ జాబ్ మేళా కి 15 కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ రోజు జరిగిన ఈ జాబ్ మేళాకు కు సుమారు 245 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 83 మంది వివిధ కంపనీలో ఎంపిక కావడం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాలకొండ MLA garu నిమ్మక జయక్రిష్ణ వొచ్చిన నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గం లో ఉద్యోగ మేళా నిర్వహించటం చాలా సంతోషకరం గా ఉంది. నిరుద్యోగ యువతీ యువకులు అవకాశం అందిపుచ్చుకోవాలి అని అన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు కట్టుబడి ఈ ప్రభుత్వం ఉంటుంది.