ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి.
స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి.
సెకి ఒప్పందం రద్దు చేయాలి.
టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేసి ప్రజలపై విద్యుత్ బరాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాజాం మండలం రాజయ్య పేట గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరెంట్ బిల్లులు తో నిరసన తెలియజేస్తూ జరిగిన కార్యక్రమంలో సిహెచ్,రామ్మూర్తి నాయుడు ఏ,సత్యారావు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు సత్య రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని ,
ప్రతిపక్షంలో ఉండగా
టిడిపి, జనసేన, బిజెపి కూటమి మేనిఫెస్టోలో 'విద్యుత్ చార్జీలు నియంత్రిస్తాం' అన్న శీర్షికలో 'విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తాం' అని హామీనిచ్చారు. చంద్రబాబు నాయుడు ఉపన్యసించిన భారీ ఎన్నికల సభల్లో ఇదే విషయం గట్టిగా చెప్పార నీ ,వైసిపి ప్రభుత్వ పాలన ఐదేళ్లలో రకరకాల పేర్లతో ఎనిమి సార్లు వేసిన రూ.32,166 కోట్ల భారంతో క్రుంగిపోతున్న రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటతో ఊరట చెందారు. రానున్న ఐదేళ్లూ కరెంటు చార్జీలు పెరగబోవని భావించార నీ అన్నారు.
.టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సార్లు సర్దుబాటు చార్జీల భారం మోపింది. ఇది వినియోగదారులందరిపైనా భారమే. నిరుపేదలు మొదలు ఆగర్భ శ్రీమంతుల వరకూ అందరికీ ఒకే విధమైన చార్జీ విధించడమంటే పేదలకు, సామాన్యులకు అది పెనుభారమే అవుతుంద నీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రెండు విడతలు కలిపితే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం వేశారు. ఇది టిడిపి కూటమి వేసిన భారం కాక మరేమిటి అని ప్రశ్నించారు
టిడిపి ప్రతిపక్షంలో ఉండగా సెకి ఒప్పందంపై విమర్శలు చేసిన టిడిపి నాయకులు అసలు కుంభకోణంపై అమెరికాలో సైతం చర్చ జరుగుతున్న సమయంలో నోరెత్తలేద నీ ,
ఒప్పందంలో రూ.2029 కోట్ల అవినీతి ఉందని, అందులో రూ.1757 కోట్లు జగన్కు అందినట్లు అమెరికా న్యాయవిభాగం తేల్చిన నేపథ్యంలో ఒప్పందంలో ఏముందో వివరించే పత్రాలను బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద నీ,ఒప్పందాలన్నిటినీ ప్రభుత్వం రద్దు చేయాల్సిందే అని అన్నారు,
*స్మార్ట్ మీటర్లతో కొత్త భారం
అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను బిగించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమయ్యాయి, రాష్ట్రంలో 1.90కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, పరిశ్రమ, వాణిజ్య వినియోగదారులకు ప్రీ పెయిడ్ మీటర్లను బిగిస్తున్నారు. త్వరలోనే 200 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు కూడా ఈ మీటర్లను అమర్చనున్నారు దీని మాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుత రాన్నరు ప్రభుత్వం తక్షణమే ప్రజలకు నష్టం కలిగించే ఈ విధానాలను విరమించుకోవాలని ఉగాది కానుగుగా ప్రజలందరికీ బారాలు ఉండబోవని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిన్న తల్లి, బూడిద బంగారమ్మ, గణపతి, సత్యవతి, సత్య రావు సత్యనారాయణ త్రినాధ పెంటయ్య మొదలగు వారు పాల్గొన్నారు.