బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజక వర్గం ఇంచార్జీ
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజక వర్గం, ఆలమూరు మండలం చింతలూరు దేశభక్తి సత్యనారాయణ, పిల్లి శంకరం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ బండారు శ్రీనివాస్ జాయినింగ్లు సమక్షంలోగ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగానిర్వహించారు.ముందుగా నూకంబిక అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆశీస్సులు తీసుకొన్నారు.
అధికారంలోకి రాగానే అన్నం పెట్టే రైతు కన్నీరు తుడిచేలా చర్యలు
ఈ సంధర్భంగా బండారు మాట్లాడుతూ వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి అని రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధారించే ఎన్నికలు అని అన్నారు .జనసేన టిడిపి పార్టీలు అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తాయని,అధికారంలోకి రాగానే అన్నం పెట్టే రైతు కన్నీరు తుడిచేలా చర్యలు తీసుకుంటాం అని వ్యవసాయం గిట్టుబాటు కాదు లాభసాటి అయ్యేలా మారుస్తాం అన్నారు.
అవినీతి, లంచగొండితనం లేని పాలన
ఈసారి జనసేన పార్టీకి సంపూర్ణ అండదండలు అందించి ఆశీర్వదించాలని ,రాష్ట్రం దశ దిశను మార్చే బాధ్యత తీసుకుంటామని జనసేన టీడీపీ తరపున ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతి, లంచగొండితనం లేని పాలన అందిస్తామని,బాధ్యత గల వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా పంపించకపోతే రాష్ట్రం బాగుపడదని, వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, కన్నీరు పెట్టని రైతాంగం ఉండాలన్నా ఒక్కసారి జనసేన టీడీపీ లకు అండగా నిలబడాలని కోరారు.
జనసేన పార్టీ ఆశయాలకు ప్రజలు ఆకర్షితులై
అనంతరం జనసేనా పార్టీ ఆశయాలకు ప్రజలు ఆకర్షితులై ఎస్సీ సామాజిక వర్గం నుండి పలువురు బండారు శ్రీనివాస్ అధ్వర్యంలో పార్టీ లో చేశారు ఇంచార్జీ బండారు శ్రీనివాస్ వారికి కండువా కప్పి సాధారంగ పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు , జిల్లా కార్యదర్శులు మండల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు టిడిపి నాయకులు జనసైనికులు , వీర మహిళలు పెద్ద యెత్తున పాల్గొన్నారు.