బొబ్బిలి "రా-కదలిరా" బహిరంగ సభ ఘనవిజయం
బొబ్బిలి "రా-కదలిరా" బహిరంగ సభ ఘనవిజయం - నియోజకవర్గ పార్టీ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి*
*సభలకు వచ్చే జనాన్ని చూసి తాడేపల్లి పిల్లిలో వణుకుడు మొదలైంది*
*మన భూముల రికార్డులను తారుమారు చేసి వాటిని అమ్ముకునేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తుంది*
వైకాపా ప్రభుత్వం కుట్ర
శృంగవరపుకోట మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ వద్ద గురువారం *శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ" ఏపీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, దౌర్జన్యాలను, అక్రమాలను ఎత్తిచూపేందుకు చంద్రబాబు నాయుడు *రా కదలిరా* కార్యక్రమాన్ని ప్రారంభించారని, దానిలో భాగంగా 10వ తేదీన బొబ్బిలిలో నిర్వహించిన *రా కదిలి రా* బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు పొల్గొని తెలుగుదేశం పార్టీకి మద్దతుతెలిపారని, సభలకు వచ్చే జనాన్ని చూసి తాడేపల్లి పిల్లిలో వణుకుడు మొదలైందని,రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని, అలాగే జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని " ఆమె పేర్కొన్నారు.
పాస్ బుక్ మీధ జగన్ బొమ్మ ఎందుకని ?
మన భూమి పాస్ బుక్ మీధ జగన్ బొమ్మ ఎందుకని ? మన భూముల రికార్డులను తారుమారు చేసి, వాటిని అమ్ము కునేంధుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తుందని,భూహక్కు చట్టం అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయని, వాటిని కూడా ఈ అవినీతి ముఖ్యమంత్రి తాకట్టు పెట్టి రుణాలు తెస్తాడని తెలిపారు.
*ఉన్న పరిశ్రమలు ఒక్కోక్కటిగా వైసీపీ నాయకుల అవినీతికి తరలిపోయాయని*
ఐదేళ్ల పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని, రాష్ట్రానికి పరిశ్రమలు ఒక్కటి కూడా రాకపోగా, ముందుగా ఉన్న పరిశ్రమలు ఒక్కోక్కటిగా వైసీపీ నాయకుల అవినీతికి తరలిపోయాయని తెలిపారు.
ప్రతి ఏటా జనవరిలో క్యాలెండర్ , మెగా డీఎస్సీ అని అన్నారని ఒక్క నోటీఫీకేషన్ కూడా ఇవ్వలేదని, మన పిల్లలు రోడ్లమీద ధర్నా చేస్తే పరిస్థితి వచ్చిందని, ఈ ప్రభుత్వ వేధింపులతో అనేక కంపెనీలు రాష్త్రం నుంచి తరలిపోయాయని, యువత టీడీపీ-జనసేన జెండా పట్టుకుని యువతలో చైతన్యం తీసుకురావాలని, యువత కోసం పరిశ్రమలు తీసుకువచ్చి, ఉద్యోగాలు ఇచ్చే భాద్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంధని ఆమె అన్నారు.
సైకో పోవాలి-సైకిల్ రావాలి
ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జి.ఎస్.నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, జడ్పీటీసీ అభ్యర్థి భీశెట్టి అరుణ, బోనంగి జ్యోతి, ఎస్.కోట పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేదం మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు పొట్నూరు అప్పలరాజు (సాయిరాం),నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాలు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్,యువత పెదగాడ రాజు, యూనిట్ ఇంఛార్జ్ కునిరెడ్డి శ్రీ రామూర్తి, బూత్ కన్వీనర్లు రవీంద్ర,అయ్యప్ప శేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.