శృంగవరపుకోటలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా ఉచిత కళ్లద్దాలు పంపిణీ
శృంగవరపుకోట మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సేవాసమితి ట్రస్టు & ఎం.వి.వి.ఎస్.మూర్తి ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుతూ *విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జ్ & గీతం అధ్యక్షులు మతుకుమిల్లి శ్రీ భరత్ గారు సహకారంతో శృంగవరపుకోట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్లలలిత కుమారి* గారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ గీతం దంత వైద్య కళాశాల & ఆసుపత్రి మరియు జిమ్ సర్ హాస్పిటల్ వారు, 10 మంది ప్రముఖ వైద్య నిపుణులతో జరిగిన ఉచిత వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలను ఎస్.కోట నియోజవర్గంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు అందరూ వినియోగించుకోవడం జరిగిందని అన్నారు.
30 రకాల వ్యాధులకు పరీక్షలు
ఈ ఉచిత వైద్య మెగా శిబిరం ద్వారా 400 మందికి మహా ఆరోగ్యాన్ని అందించడం జరిందని అన్నారు. దీనిలో ప్రధానంగా 30 రకాల వ్యాధులకు పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. దీనిలో భాగంగా కంటి పరీక్షలు చేయించుకున్న వారందరికీ, శుక్రవారం ఉచితంగా కళ్లద్దాలు లలిత కుమారి గారు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ప్రజల ఆరోగ్యము తోను ముఖ్యమంత్రి ఆటలు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించలేక లేకపోవడం వల్ల వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి ఏవో మాయమాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ప్రజలకు మెరుగైన వైద్యం అందించటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో జగన్న సురక్ష యోజన పథకం ద్వారా విలేజ్ క్లినిక్ పెట్టారు. కానీ వాటిలో అందుబాటులో ఏ ఒక్క డాక్టర్స్ లేకుండా కేవలం బీఎస్సీ నర్సింగ్, ANM, వాలెంటరీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు ప్రజల ఆరోగ్యానికి మంచిదో ఒక్కసారి ప్రజలందరూ గమనించి, ఆలోచించు కావాలని కోరారు. రాష్ట్రంలోని విద్య, వైద్యం నకు పెద్ద పీటం వేస్తామని, యువత భవిష్యత్తు తోను, ప్రజల ఆరోగ్యము తోను ముఖ్యమంత్రి ఆటలు ఆడుకోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు మేలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ బూత్ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, మరియు తదితరులు పాల్గొన్నారు.