ఏలూరు జిల్లా, పోలవరం.
మహిళా పక్షపాతి వైయస్ జగన్ అని పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, గురువారం పోలవరం మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపిఎం బి శ్రీనివాసరావు అధ్యక్షతన మహిళా సంఘాల సభ్యులు వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపిపి సుంకర వెంకట రెడ్డి పాల్గొన్నారు.ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి అని మాట ఇచ్చాడు అంటే చేసి చూపిస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో మరల ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎంపిపి కోరారు.. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.