విజయనగరం జిల్లా, రాజాం నియోజక వర్గం, రేగిడి ఆమదాలవలస మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సంకిలి లో గణిత దినోత్సవమును హెచ్.ఎం . రామినాయుడు ఆధ్వర్యంలో గణిత ఉపాధ్యాయులు బాలె.మురహరి రావు మిగిలిన ఉపాధ్యాయుల సహకారంతో ఘనంగా జరిపారు. ఉదయం నుండి విద్యార్థులకు క్విజ్ పోటీలు ,గణిత రంగవల్లి పోటీలు ,ప్రాజెక్టుల ప్రదర్శన మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్.ఎం గారు జ్యోతి ప్రజ్వలన చేసి, రామానుజన్ పటము నకు మాలధారణ జరిపారు. తదనంతరం మాట్లాడిన వక్తలు గణిత ఆవశ్యకతనుగూర్చి ,రామానుజన్ మేధావితనం గూర్చి వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనంతరం బహుమతి ప్రధానం, స్వీట్లు పంపకం జరగటంతో కార్యక్రమం ముగిసింది .విద్యార్థులు ఉదయం నుండి ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.