పాలకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పోలీట్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణని ఓకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్ సీపీకి ఓటమి భయం పుట్టుకుందని అన్నారు.
ఇప్పుడు జరుగుతున్న ఈ సభ యువగలం ముగింపు కాదు,ఇది ఒక నూతన నవశకం ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దులు కొట్టే వరకు సాగేయుద్ధం ఇది అని తెలియజేశారు. వైకాపా ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని తెలియజేస్తూ ఇది జగన్ రెడ్డి అహంకారానికి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని వైస్సార్ ప్రభుత్వం పై జనం ఎంత ఆగ్రహం తో ఉన్నారనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, మాజీ కోఆప్షన్ సభ్యులు సుంకరి అనిల్ దత్,సీనియర్ నాయుకులు చేబోతుల లక్ష్మీనారాయణ,మాజీ కౌన్సిలర్ అనాపు జవరాజు,మాజీ సర్పంచ్ బెజ్జిపురం వరహలనాయుడు,కిమిడి బంగారునాయుడు పాల్గొన్నారు.