ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసిపి యువనేత డాక్టర్ తలే రాజేష్ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు.
అనంతరం మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ తలే రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి 2024 లో కూడా ముఖ్యమంత్రిగానే తన జన్మదినం జరుపుకుంటారని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో నాకు సీట్ వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో రాజం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.