ఏలూరు జిల్లా ,పోలవరం మండల కేంద్రంలో ఉన్న ఐసిడిఎస్ ను కోయిలగూడెం మండలానికి ఏ విధంగా తరలించారని పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి సిడిపివోను ప్రశ్నించారు.
పోలవరం మండలం స్థానిక మండల పరషత్ కార్యాలయంలో ఎంపిపి సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయాన్ని కోయ్యలగూడెం తరలించడంపై ఎంపీపీ ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఐసిడిఎస్ కార్యాలయం పోలవరం మండల కేంద్రంకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిడిపివో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను, ఈవోపీఆర్టి శ్రీనివాసరావు,డిప్యూటీ తహశీల్దార్ ప్రసాదరావు, ఎస్ఐ పవన్ కుమార్ ఇతర శాఖల అధికారులు పాల్గొని మండలంలో చేసిన వివిధ అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు,సర్పంచ్ లు ప్రతినిధులు పాల్గొన్నారు..