కొత్తవలసలో కొనసాగుతున్న అంగన్ వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన శృంగవరపుకోట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి.
కొత్తవలస మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో అంగన్ వాడీలు, ఆయాలు పది రోజులకు పైగా చేస్తున్న సమ్మెకు శుక్రవారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ కోళ్ళ లలిత కుమారి మరియు టీడీపీ నాయకులు కలిసి అంగన్ వాడీల సమ్మెకు పూర్తి మద్దతుగా సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "నేడు అంగన్ వాడీల న్యాయపరమైన సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. నాడు పాదయాత్రలో అంగన్ వాడీలకు మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
అదేవిధంగా అంగన్ వాడీల, ఆయాలు పైన బెదిరింపు చర్యలు చేయడం వైకాపా ప్రభుత్వము అధికారులను మానుకోవాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీల సమ్యసలు తీరేవిధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యల్లపు సూరిబాబు,నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసీడెంట్ శ్రీమూసిరి కొండల రావ్, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.