విజయనగరం జిల్లా,శృంగవరపుకోట నియోజకవర్గం, లక్కవరపుకోట మండలం, లక్కవరపుకోట జిల్లా పరిషత్ హైస్ స్కూల్ ల్లో ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ప్రవేశపెట్టిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం, సొసైటీ ఛైర్పర్సన్ కే రమా కుమారి, మరియు స్కూల్ HM ఏ వేణుగోపాల రావు చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించి ట్యాబ్ లను స్టూడెంట్స్ కి అందజేశారు.
ముందుగా స్కూల్ HM వేణుగోపాల రావు మాట్లాడుతూ, తమకి ఇచ్చే ట్యాబ్ ధర కంటే, అందులో ఇమిడి ఉన్న బైజ్యుస్ సాప్ట్ వేర్ లక్ష రూపాయల కంటే పైనే అని, ఇలాంటివి ప్రభుత్వం ఇవ్వటం వలన, పిల్లలు ఉన్నతమైన చదువులు చదుకుంటానికి చాలా ఉంపయోగ పడుతుంది అని అన్నారు. స్కూల్ డవలప్మెంట్ కోసం తాను సాయిశక్తులా ప్రయత్నిస్తాను అని, స్కూల్ ఆవరణలో కొన్ని మార్పులు చేస్తూ పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం అని ఆయన అన్నారు.
సొసైటీ చైర్ పర్సన్ K రమా కుమారి మాట్లాడుతూ, పిల్లలు చదువుల్లో ముందు ఉండటం కోసం ఈ ట్యాబ్ లు ఎంతగానో ఉపయోగ పడతాయి, ప్రభుత్వం విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, పిల్లల భవిష్యత్ కోసం ఎంతగానో ఆలోచిస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్ పర్సన్ కే రమా కుమారి, లక్కవరపుకోట స్కూల్ HM K వేణుగోపాల రావు, పలువురు ఉపాధ్యాయులు, విధ్యారిని,విద్యార్ధులు,విధ్యారిని,విద్యార్ధుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.