ఈ లాయర్ వల్లే అయోధ్య సాకారం!
భారత న్యాయవ్యవస్థలో కేశవానంద భారతి కేసు తర్వాత అయోధ్య రామమందిరంపైనే సుదీర్ఘంగా విచారణ జరిగింది.
తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది కేశవ్ పరాశరన్ (92) సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు హిందువుల తరఫున వాదించారు.
ఒక్కోసారి ఏకంగా 4 గంటలకు పైగా నిలబడి ఉండేవారు.
రాముడిపై విపరీతమైన భక్తి ఉన్న ఆయన.. 'అది ఒకప్పుడు ఆలయం.. ఎప్పటికీ ఆలయమే' అంటూ 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేశారు. కేసును గెలిపించారు.