* ముఖ్య అతిథులుగా ఉమ్మడి పచ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ , పోలవరం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు *
ఏలూరు జిల్లా,పోలవరం.
జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంబొత్సావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పచ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ , పోలవరం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసి జనసైనికులకు దిశానిర్దేశం చేశారు.
* ఎమ్మెల్యే సిటు అఖండ మెజారిటీ గెలిచి పవన్ కళ్యాణ్ కి బహుమతి ఇవ్వాలి *
ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని, సమయం తక్కువ ఉన్నందున ప్రతీ ఒక్కరం భాద్యతగా పని చేసి అధికారంలోకి రావడంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పోలవరం ఎమ్మెల్యే సిటు అఖండ మెజారిటీ గెలిచి పవన్ కళ్యాణ్ కి బహుమతి ఇవ్వాలని సూచించారు.
* MLA చేతకానితనం *
అసమర్థ పాలనకు చరమ గీతం పాడాలన్నారు.ఎమ్మెల్యే చేతకానితనం, అసమర్ధత వల్లే టికెట్ కూడా ఇవ్వలేదని, ఇతరులు పోటీచేయ్యకుండా తన భార్యకే టికెట్ తెచ్చుకున్న ఎమ్మెల్యే అని ఏద్దేవా చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ ,మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని,ఉపాధ్యక్షులు తెలగం శెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, ప్రధాన కార్యదర్శి చీకట్లో సాయి కృష్ణమూర్తి,మామిడిపల్లి వరప్రసాద్,వనిమిరెడ్డి సీతయ్య,,తురం రమేష్,కార్యదర్శి లు తోట మనోజ్,సునీల్ కుమార్,నాగిరెడ్డి నాగేశ్వరరావు, కిషోర్,,జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు మేకల రామ్మోహన్,మాదేపల్లి భువనేశ్వరి,మామిడిపల్లి స్వాతి, నాయకులు,వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.